జనమే జయం

జనమే జయం

రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్లో ఉత్సాహాన్ని నింపేలా ప్రసంగించారు. కొత్త ఆలోచనల సృష్టికి.. నూతనంగా నేర్చుకోవడానికి కలెక్టర్ల సమావేశం దోహదం చేస్తుందని సీఎం అన్నారు. ఇప్పటి వరకు సాధించిన ఫలితాల్లో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉందన్నారు.. సక్సెస్ కిక్ మరేది ఇవ్వలేదన్నారు. పల్లె నిద్ర కార్యక్రమాన్ని అధికారులు మళ్లీ ప్రారంభించాలని.. ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసుకోవాలని... చేసే పనులను కచ్చితంగా పదే పదే చెప్పాలని సీఎం అధికారులకు సూచించారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్న గృహనిర్మాణంపై ప్రజల్లో ప్రచారం చేసుకోవాలని.. పథకాల అమలు ఓనర్‌షిప్ తీసుకునే విషయంలో మంత్రులు చురుగ్గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి.