రాష్ట్రంలో ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఉన్నారా? చంద్రబాబు ఫైర్

రాష్ట్రంలో ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఉన్నారా?  చంద్రబాబు ఫైర్

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. దుర్గగుడి రథంలో సింహాలు ఎలా మాయమయ్యాయని...సింహాల మాయంపై పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని బాబు ప్రశ్నించారు. కొంతకాలంగా ఆలయాల్లో సంప్రదాయాల్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో 80కి పైగా ఘటనలు జరిగాయని చంద్రబాబు తెలిపారు.  మత సామరస్యం చాలా సున్నితమైన అంశం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మతంపై దాడులు జరిగినప్పుడు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అయోధ్య శ్రీరామ మందిర శంకుస్థాపనను ఎస్వీబీసీలో ప్రసారం చేయకపోవడమేంటని నిలదీశారు. ఆలయాలపై దాడుల్ని ప్రభుత్వం మొదట్లోనే సీరియస్‌గా ఉంటే... వరుస ఘటనలు జరిగేవి కావని చంద్రబాబు అన్నారు. ఆలయాల్లో దాడులు చూస్తుంటే... రాష్ట్రంలో ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఉన్నారా? అనే సందేహం కలుగుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలు తిరగబడితే పాలకులు పారిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.