పదవులు పొందాక బాధ్యతలు విస్మరించారు...

పదవులు పొందాక బాధ్యతలు విస్మరించారు...

ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది... కాసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. అయితే ముందు ఏపీ సీఎం చంద్రబాబు వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు... నివాళులర్పించే సమయంలో సీఎంతో పాటు కేవలం 15 మంది మాత్రమే హాజరుకావడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు పొందాక బాధ్యతలు విస్మరిస్తున్నారంటూ ప్రజాప్రతినిదులపై అసహనం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.