గుర్తింపు రాలేదని బాధపడుతున్న హీరోయిన్

గుర్తింపు రాలేదని బాధపడుతున్న హీరోయిన్


'కలర్ ఫోటో' సినిమా  విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుహాస్ కి జోడిగా చాందినీ నటించింది. ఈ అమ్మడు  'బ్రహ్మోత్సవం' సినిమాలో మహేష్ చెల్లెలుగా నటించి ఆడియన్స్ కంట్లో పడింది. తర్వాత ఒకటో రెండో మూవీస్ చేసిన కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక ఈ సినిమాలో చాందిని దీప్తి అనే పాత్రలో నేచురల్ పెర్ఫార్మన్స్ తో  స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో చాందినీ తన నటనతో ఆడియన్స్ ని ఏడిపించింది. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖులు అందరూ మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాని పొగుడుతున్న సెలబ్రెటీలు చాందినీ చౌదరి పేరును మరచిపోతున్నారు. కమెడియన్ హర్ష , హీరో సుహాస్ ,విలన్ సునీల్ , దర్శక నిర్మాతలు సందీప్ రాజ్ - సాయిరాజేష్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ లను మాత్రమే మెచ్చుకుంటున్నారు . కానీ చాందినిని మాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ హర్ట్ అయ్యిందని తెలిసింది.