కామెంట్ చేసిన వ్యక్తికి క్లాస్ తీసుకున్న బ్యూటీ

కామెంట్ చేసిన వ్యక్తికి క్లాస్ తీసుకున్న బ్యూటీ

ఛాందిని చౌదరి .. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఈ భామ . షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులకు పరిచయమైన ఛాందిని, ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్  , గెస్ట్ రోల్స్ చేస్తూ వస్తుంది. తాజాగా కలర్ ఫోటో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిన్నది. జెర్సీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించిన నటుడు సుహాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా సునీల్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పలు షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవలే విడుదలైన ‘కలర్ ఫోటో’  ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తాను ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించాలని ఆశిస్తున్నాను. అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తాను కష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది ఛాందిని చౌదరి.  అయితే ఛాందిని వ్యాఖ్యలకు ఓ వ్యక్తి ట్విట్టర్లో స్పందిస్తూ .. నాకు సుందర్ పిచ్చైతో వర్క్ చేయాలని ఉంది సాధ్యం అవుతుందా అంటూ ఛాందిని నీకు అంత సీన్ లేదు అన్నట్లుగా కామెంట్ చేసాడు. దానికి ఛాందిని చౌదరి స్పందిస్తూ .. ప్రతి ఒక్కటి కూడా సాధ్యమే.. కానీ ప్రయత్నించకుండా ఉంటే మాత్రం అది సాధ్యం కాదు. నేను నా కలలను నెరవేర్చుకునేందుకు కష్టపడుతూ ముందుకు సాగుతున్నాను. ఏదో ఒక రోజు నేను అనుకున్న కలలు అన్ని కూడా సాధ్యం అవుతాయి. నువ్వు ఇలా సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మానేసి నీకలల కోసం కష్టపడు ఏదో ఒక రోజు నీవు అనుకున్నది సాధ్యం అవుతుంది. నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ కౌంటర్ ఇచ్చింది.