కరోనాపై యుద్దానికి భారీ విరాళం... 

కరోనాపై యుద్దానికి భారీ విరాళం... 

కరోనా రోజు రోజుకు పెరిగిపోతున్నది.  కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  జనతా కర్ఫ్యూ సక్సెస్ కావడంతో ఇప్పుడు దేశంలోని అనేక లాక్ డౌన్ చేశారు.  ఇది ఇప్పుడు అందరిని భయపెడుతున్నది.  లాక్ డౌన్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  కరోనాను ఎదుర్కొనడానికి చైనాలో వ్యాపార దిగ్గజాలు ముందుకు వచ్చి అక్కడి ప్రభుత్వానికి భారీ సహాయం అందించాయి.  

అంతేకాదు, అక్కడి టెక్ సంస్థలు కూడా సాంకేతిక సహాయం అందించడంతో కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అయితే, ఇప్పుడు ఇండియాలో కూడా కరోనా వైరస్ పై యుద్ధం చేయడానికి దిగ్గజాలు తమ వంతు సహాయం అందిస్తున్నాయి.  వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ రూ.100 కోట్ల సహాయం అందించారు. ఈ డబ్బును పేదల అవసరాల కోసం వినియోగించాలని కోరారు.  అదే విధంగా టెక్ దిగ్గజం మహేంద్ర కూడా ముందుకు వచ్చింది.  తమ రిసార్ట్స్ లను తాత్కాలిక క్వారెంటైన్ లను ఏర్పాటు చేసుకోవడానికి వినియోగించుకోవచ్చని ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారు.