వన్డేలో చాహల్ చెత్త రికార్డ్...

వన్డేలో చాహల్ చెత్త రికార్డ్...

ఈరోజు భారత్-ఆసీస్ ల మధ్య సిడ్నీలో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డే మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డు తన పేరున మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 10 ఓవర్లు వేసిన చాహల్ 1 వికెట్ తీసి 89 పరుగులు ఇచ్చాడు. దాంతో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత స్పిన్నర్ గా చాహల్ చెత్త రికార్డు నెలకొల్పాడు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది అందర్నీ ట్రోల్ చేసే చాహల్ ను... ఈ ఇన్నింగ్స్ తర్వాత భారత అభిమానులు బాగా ట్రోల్ చేస్తున్నారు.