యూట్యూబర్‌తో క్రికెటర్ చాహెల్ నిశ్చితార్థం

యూట్యూబర్‌తో క్రికెటర్ చాహెల్ నిశ్చితార్థం

టీమిండియా క్రికెటర్‌‌ యజువేంద్ర చహల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. యూట్యూబర్, కొరియో గ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లాడబోతున్నాడు. ఈ విషయాన్ని చహల్‌ స్వయంగా ప్రకటించాడు. గత కొంతకాలంగా ధనశ్రీతో చహల్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చని విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పెళ్లీ ముహుర్తం ఖరారు చేసేందుకు శనివారం రోకా వేడుకను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.