చావు కబురు చల్లగా: ‘కదిలే కాలాన్నడిగా’ సాంగ్
పెగళ్ళపాటి కౌశిక్ దర్శకత్వంలో కార్తికేయ - లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘చావు కబురు చల్లగా’. ఈ మూవీలో కార్తికేయ 'బస్తీ బాలరాజు', లావణ్య త్రిపాఠి ‘మల్లిక’ పాత్రల్లో కనిపించనుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'కదిలే కాలాన్నడిగా' అనే మరో సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)