సిఎస్కే ఆటగాళ్ల కుటుంబాలు యూఏఈ కి వెళ్లడం లేదు...

సిఎస్కే ఆటగాళ్ల కుటుంబాలు యూఏఈ కి వెళ్లడం లేదు...

చెన్నై సూపర్ కింగ్స్, యాజమాన్యం తమ దగ్గరగా ఉన్న యూనిట్ ను చాలా గౌరవిస్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో తమ విజయానికి గల రహస్యాలలో వారు ఒకటి అని చెప్తారు. అలాగే ఆటగాళ్ల తో వచ్చిన వారి పిల్లల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో అది జరగడం లేదు. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరగనుంది. ఇందుకోసం ఆటగాళ్లు ఒక నెల ముందే అక్కడికి చేరుకోనున్నారు. అయితే  ఐపీఎల్ కు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించాలా.. వద్ద అనే విషయాన్ని బీసీసీఐ ఫ్రాంఛైజీలకే వదిలేసింది. ఒకవేళ అనుమతిస్తే ఆటగాళ్లతో పాటు వారు కూడా లీగ్ ముగిసేంతవరకు బయో సెక్యూర్ బబుల్‌లో ఉండాల్సిందే అని చెప్పింది. అయితే ఈ విషయం లో ఓ నిర్ణయం తీసుకుంది సిఎస్కే యాజమాన్యం. తమ ఆటగాళ్ల కుటుంబ సభ్యులను యూఏఈ కి అనుమతించడం లేదు అలాగే జట్టు సహాయక సిబ్బందిని కూడా యూఏఈ కి తీసుకెళ్లడం లేదని సిఎస్కే సిఇఓ విశ్వనాథన్ తెలిపారు. మొదట కేవలం ఆటగాళ్లను మాత్రమే యూఏఈకి తీసుకవెళ్లి, అక్కడ విషయాలు ఎలా పని చేస్తాయనే దానిపై ఆధారపడి మేము తరువాత జట్టు సహాయక సిబ్బందిని మరియు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అక్కడికి తీసుకరావడం పై ఆలోచిస్తామని విశ్వనాథన్ తెలిపారు. అయితే ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయం పై నిర్ణయం తీసుకున్న మొదటి జట్టు సిఎస్కే.