కేంద్రం అలర్ట్: వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలని సూచన... 

కేంద్రం అలర్ట్: వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలని సూచన... 

దేశంలో కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి వరకు రాబోతున్న సంగతి తెలిసిందే.  అయితే, నవంబర్ 25 నుంచి దేశంలో వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ను నిర్వహించబోతున్నారు.  ట్రయల్స్ ను నిర్వహిస్తూనే అత్యవసర వినియోగం కింద అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నది.  ట్రయల్స్ పూర్తయ్యేలోగా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన అన్ని అంశాలను పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది.  ఇందులో భాగంగానే రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ కరోనా వ్యాక్సిన్ పంపిణి మార్గదర్శకాలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిట ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.  వ్యాక్సిన్ పంపిణి విషయంలో సమన్వయము, పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.  అలానే సోషల్ మీడియాలోనూ, ఆన్లైన్ మీడియాలోనూ కోవిదు వ్యాక్సిన్ పై వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, ఫేక్ వార్తలపై చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది.  వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత మొదటగా దేశంలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకాలు ఇవ్వడం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలౌతుందని, వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ఏడాదిపాటు జరుగుతుందని కేంద్రం పేర్కొన్నది.  కరోనా టీకా పంపిణి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం రాసిన లేఖలో పేర్కొంది.