ఏపీలో బీజేపీ బలపడుతుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఏపీలో బీజేపీ బలపడుతుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర హోమ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి విజయవాడలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆదివారం ఇక్కడ పర్యటించిన కిషన్ రెడ్డి..మొదట ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయన..సంప్రదాయ పూజ కార్యక్రమాలు అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భంగ ఆయన మాట్లాడుతూ..తెలుగు ప్రజలందరికి మంచి జరగాలని దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు దుర్గమ్మను దర్శనం చేసుకొని కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుకున్నానని తెలిపారు. ప్రధాని మోడీ, జెపి నడ్డా ఆరాధ్యంలో ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ పార్టీ బలపడుతుందని విశ్వాసం తనకు ఉందని తెలిపారు. పదవుల్లో ఉన్న లేకున్నా పార్టీ కోసం పని చేయాలనీ కోరారు మంత్రి కిషన్ రెడ్డి