కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్

కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్


కరోనా కట్టడికి కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోషల్ డిస్టెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సోషల్ డిస్టెన్స్‌పై అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి సోషల్ డిస్టెన్సే ఏకైక మార్గమన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. దేశ ప్రజలందరూ 21 రోజులు లాక్‌డౌన్ పాటించాలన్న ఆయన నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచి ఉంటాయన్నారు. అంతేకాదు పేదలకు 2 రూపాయలకే కిలో గోధుమలు, 3 రూపాయలకే కిలో బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం 80 కోట్ల మంది పేదలకు వర్తిస్తుందన్నారు ప్రకాశ్ జవదేకర్. లాక్‌డౌన్ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానాన్న ఆయన 21 రోజులు కుటుంబసభ్యులతో ఇంట్లోనే గడపండని కోరారు.