గుడ్ న్యూస్: పేదల కోసం భారీ ప్యాకేజ్...వైద్యులకు ఇన్సూరెన్స్... 

గుడ్ న్యూస్: పేదల కోసం భారీ ప్యాకేజ్...వైద్యులకు ఇన్సూరెన్స్... 

కరోనా వైరస్ పై యుద్ధం చేసేందుకు ఇండియా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  లాక్ డౌన్ కారణంగా దేశంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు.  పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు సైతం ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ప్రజలు చాలా వరకు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  వీళ్ళను ఆదుకోవడానికి కేంద్రం ముందుకు వచ్చింది.  దేశంలో ఆకలి  చవులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది.  హామీ ఇచ్చినట్టుగానే కేంద్రం గరీబ్ కళ్యాణ్ పేరుతో లక్షా 70వేల కోట్ల రూపాయలతో ఆర్ధిక ప్యాకేజీని  ప్రకటించింది. వచ్చే మూడు నెలల వరకు పేదలకు ఐదు కేజీలు బియ్యం లేదా ఐదు కేజీల గోధుమలు, కేజీ కంది పప్పును ఫ్రీగా అందించబోతున్నట్టు ప్రకటించింది.  అనే విధంగా రైతులకు నెలకు రెండు వేలరూపాయల చొప్పున వారి అకౌంట్ లోకి డబ్బులు వేయబోతున్నట్టు ప్రకటించారు.  

అదే విధంగా దేశంలోని 20 కోట్ల మహిళలకు నెలకు రూ.500 చొప్పున  మూడు నెలల పాటు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మూడు నెలల పాటు మహిళా ఉజ్వల్ యోజన కింద మూడు నెలలపాటు నెలకు ఒక గ్యాస్ సిలెండర్ చొప్పున ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.  అలానే కరోనాతో పోరాటం చేస్తున్న నర్సులు,వైద్యులు, పారిశుధ్య కార్మికులకి హెల్త్ ఇన్సూరెన్స్..50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నారు. 20 లక్షల వైద్య బృందాలకి ఈ ఇన్సూరెన్స్ వర్తించబోతున్నట్టు పేర్కొన్నారు.  60 ఏళ్ళు పైబడిన వితంతువులు, దివ్యాంగులకి అదనంగా వెయ్యి ఎక్స్ గ్రేషియా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.