విషాదం:  సెల్ ఫోన్ పేలి తల్లీ..ఇద్దరు చిన్నారులు మృతి

విషాదం:  సెల్ ఫోన్ పేలి తల్లీ..ఇద్దరు చిన్నారులు మృతి


సెల్‌ఫోన్లు ఈ మధ్య చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా.. తమిళనాడులో సెల్ ఫోన్ వల్ల ఓ విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన ఘటన కరూర్ జిల్లాలో చోటు చేసుకుంది. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి ఇద్దరు పిల్లలతో కలిసి ముత్తులక్ష్మీ అనే మహిళ నిద్రలోకి జారుకుంది. అయితే ప్రమాదవశాత్తు ఆ సెల్‌ఫోన్ పేలిపోవడంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో మంటలు వ్యాప్తి చెందడటంతో ముత్తులక్ష్మీతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు రంజిత్, దక్షిత్ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.