బన్నీకి సినీప్రముఖుల విషెస్

బన్నీకి సినీప్రముఖుల విషెస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. డ్యాన్స్, స్టైల్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాలు చేస్తూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నాడు.  గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన బన్నీ.. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాను చేస్తున్నాడు. అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో  సినిమా కావటంతో భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్ లో రూపొందిస్తున్నారు. ఈ సినిమా తరువాత డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడు. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నారు. 

‘నా ప్రియమైన బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు ‘పుష్ప' టీజర్ చూశాను. వాస్తవానికి దగ్గరగా ఊరమాస్‌గా ఉంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌.. తగ్గేదే లే!’ అంటూ చిరు విషెస్ తెలియజేశారు. ‘ఈ ఏడాదంతా నీకు అత్యద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే బగ్సీ!’ అంటూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ విషెస్ తెలిపింది. వీరితో పాటుగా పలువురు ప్రముఖులు బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.