హైదరాబాదీలకు సీసీఎంబీ గుడ్‌న్యూస్.. 54 శాతం మందిలో యాంటీబాడీస్..!

హైదరాబాదీలకు సీసీఎంబీ గుడ్‌న్యూస్.. 54 శాతం మందిలో యాంటీబాడీస్..!

కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తూనే ఉంది.. కానీ, మరణాలు తగ్గిపోయాయి.. ఇక, హైదరాబాద్‌లో ఒక్కప్పుడు కరోనా కేసులు హాట్ స్పాట్‌గా ఉంది.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి పాజిటివ్ కేసులు.. అయితే, ఇప్పుడు హైదరాబాదీలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది సీసీఎంబీ.. హైదరాబాద్‌లో 54 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని సీసీఎంబీ తెలిపింది. కరోనా సోకినవారిలో 78 శాతం మందిలో యాంటీబాడీస్ తయ్యారయ్యాయన్నారు. మహిళల కన్నా పురుషుల్లో 3 శాతం అధికంగా యాంటీబాడీస్ తయారైనట్లు తన రిపోర్ట్‌లో తెలిపింది. అయితే వయసు పైబడినవారిలో తక్కువ యాంటీబాడీస్ తయ్యారయ్యాయన్నారు. మొత్తం 9 వేల మందిని పరీక్షించి సీసీఎంబీ.. ఫలితాలు వెల్లడించింది. హైదరాబాద్‌లో 30 వార్డుల్లో 9 వేల మంది నుంచి నమూనాల సేకరించి శాస్త్రవేత్తులు పరీక్షించారు. మొత్తంగా పురుషుల్లో 53 శాతం మందిలో.. స్రీలల్లో 56 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు సీసీఎంబీ వెల్లడించింది.