చంద్రబాబు ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం

చంద్రబాబు ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లోని ఎస్కార్ట్  వాహనం బోల్తాపడి ప్రమాదం చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు ఈరోజు బుధవారం అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు.  ఆయనకు కాన్వాయ్‌లో పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటుచేశారు.  చంద్రబాబు పర్యటన పూర్తిచేసుకుని వెళుతున్న సమయంలో పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలోగల నేషనల్ హైవేపై ఎస్కార్టు వాహనం బోల్తా పడింది.  దీంతో వాహనంలో ఉన్న ఎస్‌ఐ రామాంజనేయులు, ఏఆర్‌ సీసీ విజయ్‌కుమార్‌ తీవ్ర గాయాలపాలయ్యారు.  దీంతో వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.