రాయపాటిపై సీబీఐ కేసు నమోదు... సెక్షన్లు ఇవే...!

రాయపాటిపై సీబీఐ కేసు నమోదు... సెక్షన్లు ఇవే...!

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీబీఐ కేసులు నమోదు చేసింది... ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రుణం ఎగవేతపై యూనియన్ బ్యాంక్... సీబీఐకి ఫిర్యాదు చేసింది. నవంబర్ 18వ తేదీన యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ ఎస్కే భార్గవ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీబీఐ... ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు ట్రాన్స్‌ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, ట్రాన్స్‌ట్రాయ్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస బాబ్జిలతో పాటు మరికొందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. ఇక ట్రాన్స్‌ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, ట్రాన్స్‌ట్రాయ్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస బాబ్జిలతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చిన సీబీఐ.. వారిపై 120 (బీ), రెడ్‌విత్ 420, 406, 468, 477 (ఎ) పీసీఈ యాక్ట్ 13 (2), రెడ్‌ విత్ 13 (1) డీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.