ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ కేసు

ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ కేసు

వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేసు నమోదు చేసింది సీబీఐ... బ్యాంక్‌ లోన్‌ బకాయిలపై కేసు నమోదు చేసిన సీబీఐ సోదాలు నిర్వహించింది.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చెందిన  హైదరాబాద్‌లోని నివాసంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ దాడులు కొనసాగాయి... ఈనెల 6న హైదరాబాద్‌, ముంబై సహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన సీబీఐ.. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై చీటింగ్‌ కేసు నమోదు చేసింది. బ్యాంకును మోసగించిన అభియోగంపై రఘు రామకృష్ణ రాజుపై కేసు నమోదు చేశారు.. ఎఫ్ఐఆర్ లో నిందితులుగా ఇండ్ భారత్ సంస్థ, రఘు రామకృష్ణ రాజుతో సహా మొత్తం 10 మంది ఉన్నారు.. ఐపీసీ సెక్షన్లు 120(బీ), 420తో పాటు అవినీతి నిరోధక చట్టం 13(2),  13(1)(డీ) కింద కేసు నమోదు చేసింది సీబీఐ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సౌరభ్ మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.. బ్యాంకును రూ. 826.17 కోట్లు మోసం చేసినట్టు సీబీఐకి ఫిర్యాదు అందింది. ఇక, ఇండ్‌-భారత్‌ కంపెనీ సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు.. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు చేశారు.. పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.