గుంటూరు అర్బన్‌ పోలీసులపై సీబీఐ కేసు

గుంటూరు అర్బన్‌ పోలీసులపై సీబీఐ కేసు

గుంటూరు అర్బన్‌ పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నల్లబోలు సునీత, రాయిది నాగలక్ష్మి, తుమ్మటి విజయలక్ష్మి అనే మహిళల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు మహిళల భర్తలను అక్రమంగా నిర్బంధించారని కేసు పోలీసుల మీద కేసు పెట్టారు. ఈ నిర్బంధంపై గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మహిళలు. హైకోర్టులో తమ భర్తలకు సంబందించి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. మహిళల భర్తల నిర్బంధంపై పోలీసుల కౌంటర్‌ దాఖలు చేశారు. అయితే పోలీసుల కౌంటర్‌ మీద అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు, గుంటూరు సీసీఎస్ పోలీసుల పాత్రపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీబీఐ తమ దర్యాప్తు మొదలుపెట్టింది.