మరో భూవివాదంలో బొండా..

మరో భూవివాదంలో బొండా..

విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మరో భూవివాదంలో చిక్కుకున్నారు. సుబ్బరాయనగర్ వెంచర్‌లో తనకు స్థలం ఇప్పిస్తానని చెప్పి రూ.35 లక్షలు వసూలు చేసి ..ఎమ్మెల్యే అతని అనుచరులు మోసం చేశారంటూ నందిగామకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఎన్ని రోజులవుతున్నా స్థలం చూపించకుండా.. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని... డబ్బు అడిగితే బొండా అనుచరులు మాగంటి బాబు, వర్మ, వాసు బెదిరిస్తున్నారని సుబ్రమణ్యం ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే బొండాతో పాటు మిగిలిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు.

నాకు వాళ్లతో సంబంధాలు లేవు:
భూవివాదంపై మీడియాతో కథనాలు వస్తుండటంతో ఎమ్మెల్యే బొండా ఉమా స్పందించారు. తనకు ఆ లావాదేవీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు మాగంటి బాబు ఎవరో కూడా తనకు తెలియదని.. నేను ల్యాండ్ డీల్ గురించి ఎవరి వద్దా ప్రస్తావించలేదని బొండా తెలిపారు. తనపై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు కావాలనే ఇలాంటి చర్యలకు దిగుతున్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాల్సిందిగా కమిషనర్‌కు తానే చెబుతానని ఉమ వెల్లడించారు.