లాక్ డౌన్ మహిమ: గుండు గీయించుకోవాలని భార్యకు వేధింపులు... ఇదే కారణమట...!!

లాక్ డౌన్ మహిమ: గుండు గీయించుకోవాలని భార్యకు వేధింపులు... ఇదే కారణమట...!!

మగువలకు జుట్టే అందం ఈ విషయం అందరికి తెలుసు.  జుట్టు లేకుండా ఆడవాళ్లు అసలు ఉండరు.  ఎప్పుడైనా జట్టు తీయించుకోవాల్సి వస్తే మరలా జుట్టు పెరిగే వరకు బయటకు రారు. అయితే, ఓ భర్త మాత్రం భార్యకు గుండు చేయాలనీ చూశాడు.  తాను మాత్రమే అందంగా కనిపించాలని, భార్య అందంగా కనిపించకూడదు అని చెప్పి వేధించసాగాడు.  ఈ వేధింపులు తాళలేక సహాయవాణిని ఆశ్రయించింది.  కౌన్సిలింగ్ తీసుకొని ఇంటికి వచ్చిన రెండు రోజుల తరువాత తిరిగి వేధించడం మొదలుపెట్టాడు.  లైంగికంగా కూడా వేధింపులు మొదలయ్యాయి.  దీంతో ఆ భార్య చేసేది లేక జుట్టు కత్తిరించుకుంది.  పిల్లల ముందు గొడవలు పడకూడదు అనే ఉద్దేశ్యంతో అలా చేసింది.  

కానీ, ఆ భర్త అక్కడితో ఆగకుండా భార్య గుండు చేయించుకోవాలని వేధించడం మొదలుపెట్టాడు.  కొట్టేవాడు.  ఆ చిత్రహింసలు భరించలేక ఆ భార్య బెంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి కంప్లైంట్ చేసింది.  దీంతో భర్తపై గృహహింస కేసు నమోదు చేసి భార్యను స్వాధర్ కేంద్రానికి తరలించారు.