చెన్నై వాసుల భలే ఐడియా.. వరదల నుంచి కార్లు ఇలా కాపాడుకున్నారు..!

చెన్నై వాసుల భలే ఐడియా.. వరదల నుంచి కార్లు ఇలా కాపాడుకున్నారు..!

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసినప్పుడు.. వరదల్లో కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు పడవల్లా మారిపోయాయి.. రోడ్లపై పార్క్‌ చేసిన వాహనాలు.. బతుకమ్మల్లా వరదనీటిలో కొట్టుకుపోయాయి.. అయితే, నివర్‌ తుఫాన్‌ సమయంలో చెన్నై వాసులకు భలే ఐడియా తట్టింది... తమిళనాడును అతలాకుతలం చేసిన నివర్ తుపాన్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది.. అయితే, భారీ వర్షాల కారణంగా తమ కార్లు వరద నీటిలో మునిగిపోకుండా చెన్నై వాసులకు ఓ ఐడియా వచ్చింది.. రాజధాని నగరంలోని వెలాచెరీ ప్రాంతంలోని మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్‌ను సురక్షితమైన ప్రదేశంగా గుర్తించారు. దాంతో కారు యజమానులు ఒకరితరవాత ఒకరు తమ వాహనాలను అక్కడ పార్క్ చేశారు. దాంతో ఎన్నడూ చూడని విధంగా విలాసవంతమైన, ఖరీదైన కార్లన్నీ ఒక దగ్గర దర్శనమిచ్చాయి. మొత్తానికి ఒకే ఐడియాతో తమ కార్లను కాపాడుకోగలిగారు ఇలా..