సిపీఎల్ షెడ్యూల్ వచ్చింది... ఐపీఎల్ కు నో ప్రాబ్లమ్..

సిపీఎల్ షెడ్యూల్ వచ్చింది... ఐపీఎల్ కు నో ప్రాబ్లమ్..

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ను సెప్టెంబర్ 19 నుండి యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దాంతో అభిమానులు, ఆటగాళ్లు, ఫ్రాంఛైజ్ లు అందరూ పండుగ చేసుకున్నారు. కానీ అప్పుడే అందరిలోనూ ఓ అనుమానం మొదలైంది. ఏంటంటే మన ఐపీఎల్ లో భారత ఆటగాళ్లతో పాటుగా విదేశీ ఆటగాళ్లకు ప్రాముఖ్యం ఉంది. అది కూడా ముఖ్యంగా వెస్టిండీస్ మరియు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు. అయితే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మేము కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సిపీఎల్) ను ఆగస్టు లో నిర్వహిస్తాం అని ఎప్పుడో ప్రకటించింది. దాంతో విండీస్ ఆటగాళ్లు ఐపీఎల్ లో పాల్గొనగలరా... లేదా అనే అనుమానం వచ్చింది. ఇక తాజాగా సిపీఎల్ షెడ్యూల్ ను వెస్టిండీస్ బోర్డు విడుదల చేసింది. ఆ షెడ్యూల్ చుసిన తర్వాత ఐపీఎల్ కు నో ప్రాబ్లమ్ అనుకున్నారు అంత! ఎందుకంటే సిపీఎల్ ఆగస్టు 18 న ప్రారంభమై సెప్టెంబర్ 10 న ముగుస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 19 న జరిగే ఐపీఎల్ లో విండీస్ ఆటగాళ్లు ఆడుతారు. కానీ కరోనా నియమాల ప్రకారం వారు 14 రోజుల క్వారంటైన్ లో  ఉండాలి కాబట్టి  మొదటి కొన్ని మ్యాచ్ లు మాత్రం వారు ఆడలేరు అని చెప్పాలి.