జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం... ఇద్దరికి గాయాలు 

జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం... ఇద్దరికి గాయాలు 

హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 3 వద్ద ఓ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది.  జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి వేగంగా వచ్చి ఇండికా క్యాబ్ ను డీకోట్టింది బెంజ్ కారు.  ఈ ప్రమాదంలో ఇండికా క్యాబ్ లో ప్రయాణం చేస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  ప్రమాదంలో గాయపడిన ఇద్దర్ని హాస్పిటల్ కి తరలించారు.  ప్రమాదానికి కారణమైన బెంజ్ కారులో ముగ్గురు యువకులు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని, పబ్ లో మద్యం సేవించి యాక్సిడెంట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు.  మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఉన్న రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.