చక్కెర పరిశ్రమకు మరిన్ని రాయితీలు?

చక్కెర పరిశ్రమకు మరిన్ని రాయితీలు?

ఇథనాల్ ధరను 25 శాతం పెంచి సుగర్‌ కంపెనీలకు ఎంతో మేలు చేసిన కేంద్ర ప్రభుత్వం రేపటి కేబినెట్‌ మీటింగ్‌లో మరిన్ని రాయితీలు ప్రకటించే అవకాశముంది. వచ్చే చక్కెర సీజన్‌కు చెరకు మద్దతు ధరను రేపటి భేటీలో నిర్ణయించే అవకాశముంది. ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు ఉదయం 10.30గంటలకు కేబినెట్‌ భేటీ కానుంది. ఈ భేటీ అజెండాలో చక్కెర పరిశ్రమలకు ఎగుమతి రాయితీలు ఇచ్చే అంశం కూడా ఉంది. దీనిపై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇథనాల్ ధరను పెంచడంతో గత నాలుగు రోజులుగా భారీగా పెరుగుతున్న చక్కెర షేర్లు ఇవాళ కాస్త శాంతించాయి. రేపటి భేటీ దృష్ట్యా మళ్ళీ వెలుగులోకి వచ్చే అవకాశముంది.