ఆర్బీఐ నిర్ణయం.. ఈఏంఐలు పెరుగుతాయా? అమౌంట్ పెరుగుతుందా?

ఆర్బీఐ నిర్ణయం.. ఈఏంఐలు పెరుగుతాయా? అమౌంట్ పెరుగుతుందా?

కరోనా వేళ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విధించింది. రుణాలు తీసుకున్న అందరూ.. మూడు నెలలు ఈఎంఐలు కట్టకుండా వెసులుబాటు కల్పించింది ఆర్‌బీఐ. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న వారికి ఊరట లభించింది. అయితే ఆర్‌బీఐ నిర్ణయంతో మూడు నెలలు ఊరట లభించింది సరే.. తర్వాత పరిస్థితి ఏంటి? ఈఎంఐలు పెరుగుతాయా? ఈఎంఐల అమౌంట్ పెరుగుతుందా? అనే అనుమానాలు అందరికి తలెత్తుతున్నాయి. దీనిపై ఎన్టీవీతో మాట్లాడిన అనలిస్ట్ నర్సింహా మూర్తి .. క్లారిటీ ఇచ్చారు. ఆర్‌బీఐ నిర్ణయంతో కొంత ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే కరోనా ప్రభావం తర్వాత మాత్రం ధరలు పెరగొచ్చు అన్నారు. ఆర్‌బీఐ నిర్ణయంతో పెద్ద కంపెనీలకు కొంత ఊరటలభించిందన్న నర్సింహా మూర్తి.. ఉద్యోగాలు పోతాయనే భయం మాత్రం లేదన్నారు. ఇక ఈఎంఐలపై మూడు నెలల మారటోరియంతో ఈఎంఐల సంఖ్య పెరగబోదన్న ఆయన ఈఎంఐల అమౌంట్ మాత్రం పెరుగుతుంది అని వివరణ ఇచ్చారు. కేంద్రం కొంత తొందరగా స్పంధించడంతో చాలా నష్టాలను తగ్గించ గలిగింది అని చెప్పారు అనలిస్ట్ నర్సింహా మూర్తి.