చరిత్ర సృష్టించిన బీఎస్పీ

చరిత్ర సృష్టించిన బీఎస్పీ

బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) కర్ణాటకలో చరిత్ర సృష్టించింది. కొలేగల్‌ నియోజకవర్గంలో బీఎస్పీ తరఫున పోటీ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ మహేష్ విజయం సాధించడంతో బీఎస్పీ కర్నాటకలో ఖాతా తెరిచింది. 1957 నుంచి ఒక్కసారి మినహా ప్రతిసారీ ఇక్కడ కాంగ్రెస్‌ గెలుస్తూ వచ్చింది. కొనేగల్ నియోజకవర్గం ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది. 1, 93, 293 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజవర్గంలో పురుషుల ఓటర్లు 1,00,659 మరియు 98, 920 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1957 నుండి 2013 వరకు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకర్గంలో 10 సార్లు గెలిచింది, బీజేపీ 2009 ఉప ఎన్నికలో ఒక్కసారి గెలిచింది. కాగా, బీఎస్సీ అభ్యర్థి మహేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. గత ఎన్నికలో 10 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలైన మహేష్... ఈ సారి విజయం సాధించి... బీఎస్పీ ఖాతా తెరిచేలా చేశారు.