డ్రగ్స్ కేసులో బీఎస్ఎఫ్ జవాన్ అరెస్ట్.!

   డ్రగ్స్ కేసులో బీఎస్ఎఫ్ జవాన్ అరెస్ట్.!

ఇటీవల బార్డర్ వద్ద ఆఫ్గనిస్తాన్ కు చెందిన ఓ డ్రగ్స్ ముఠా బార్డర్ వద్ద ఇండియాలోకి చొరబడటానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణలో ముఠా జవాన్లపైకి రాళ్లు విసిరి పారిపోయారు. కాగా తాజాగా ఆ  డ్రగ్స్ కేసులో పంజాబ్ పోలీసులు ఓ బిఎస్ఎఫ్ జవాన్ ను అరెస్ట్ చేసారు. గురుదాస్ పూర్ కు చెందిన జవాన్ కు డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నాయని అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అతడిని  సంబా సెక్టార్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని అన్నారు. అతడి వద్ద నుంచి పోలీసులు ఒక పిస్టల్ ను, 80 రౌండ్ల బుల్లెట్లను, రెండు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అంతే కాకుండా మూడు ఫోన్ లను సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు.