శభాష్ సైనిక: 60 గంటల్లో 120 అడుగుల వంతెన నిర్మాణం
దేశంలో ఎక్కడ ఎలాంటి అత్యవసరం వచ్చినా, విపత్తులు తలెత్తిన అక్కడికి వచ్చి విశేషమైన సేవలు అందించే వ్యక్తులు ఎవరు అంటే సైనికులు అని చెప్తారు. అన్నింటికీ తెగించి సైన్యంలో చేరుతారు కాబట్టి, అన్ని రకాల ఇబ్బందులను తట్టుకొని నిలబడి సేవ చేస్తుంటారు. జమ్మూ కాశ్మీర్ వంటి పర్వత ప్రాంతాల్లో పనిచేయడం అంటే కత్తితో సాము లాంటిదే. కొండచరియలు విరిగిపడుతుంటాయి. బ్రిడ్జీలు కూలిపోతుంటాయి. అలాంటి సమయంలో అత్యవసరంగా స్పందించి గంటల వ్యవధిలోనే బ్రిడ్జీలను నిర్మించాల్సి ఉంటుంది. ఇలానే జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ వద్ద కేలా మోర్ వద్ద వంతెన కూలిపోయింది. కూలిన వంతెనను తిరిగి నిర్మించేందుకు రంగంలోకి దిగింది. కేవలం 60 గంటల సమయంలోనే 120 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను నిర్మించారు. శనివారం సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించిన తరువాత, మాములు వాహనాలను అనుమతించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)