పెళ్లికి గంటముందు వరుడికి షాక్ ఇచ్చిన వధువు

 పెళ్లికి గంటముందు వరుడికి షాక్ ఇచ్చిన వధువు

మరో గంటలో పెళ్లి తంతు ముగిసిపోనుంది... అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.. రెండు కుటుంబాల్లో కోలాహల వాతారణం ఉంది.. ఈ సమయంలో ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది పెళ్లి కూతురు.. నాకు ఈ పెళ్లి వద్దంటూ మొండికేసింది.. ఇతడితో వివాహం ఇష్టం లేదంటూ భీష్మించుకు కూర్చుంది.. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు.. ఇక, అంతటితో ఆగకుండా.. ప్రియుడ్ని కూడా రంగంలోకి దింపింది.. దీంతో.. పెళ్లి కుమారుడు షాక్‌ తిన్నాడు.. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో జరిగింది. ఆ తర్వాత తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ.. పోలీసులను ఆశ్రయించింది.. దీంతో.. అధికారులు ప్రేమికులకు వివాహం జరిపించారు... కానీ, వరుడికి మాత్రం ఊహించని షాక్‌ తగిలింది.. ఈ విషయం ముందే చెప్పొచ్చుకదా అంటూ నిట్టూర్చడం తప్ప వేరే దారిలేకపోయింది.. పెళ్లి వరకు వెళ్లి పరువు తీసుకున్నానంటూ మదతనపడుతున్నాడు ఆ యువకుడు... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి...