తనకు కరోనా పాజిటివ్ అని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన లారా..

తనకు కరోనా పాజిటివ్ అని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన లారా..

కరోనా వారు వీరు అనే తేడా లేకుండా అందరిని అటాక్ చేస్తుంది. ఈ నేపధ్యం లోనే ఇప్పటికే చాల మంది సినిమా సెలబ్రెటీలు, క్రీడాకారులు, రాజకీయనాకులు ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే క్రికెట్ ప్రపంచ లోనైతే ఈ వైరస్ ప్రభావం కొంచెం తక్కువే ఉంది అని చెప్పాలి. కానీ లెజెండరీ వెస్టిండీస్ బ్యాట్స్మాన్ బ్రియాన్ లారా కు కరోనావైరస్ సోకిందని వార్తలు వస్తున్నాయి. ఈ పుకారు వార్తలపైనా లారా స్పందించాడు. తన ఇంస్టాగ్రామ్ వేదికగా ''నేను కరోనా పరీక్షలు చేయించుకున్నాను. కానీ ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది'' అని స్పష్టం చేసాడు. అలాగే ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను" అని బ్రియాన్ లారా చెప్పారు. ఇక లారా అంతర్జాతీయ కెరీర్ లో 131 టెస్టులు ఆడాడు, 34 సెంచరీలు మరియు 48 అర్ధ సెంచరీలతో సహా 11953 పరుగులు చేశాడు. అలాగే 299 వన్డేల్లో లారా 19 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలతో సహా 10405 పరుగులు చేశాడు.