ఆ అలవాటును ఒక రోజులో మార్చలేం : బ్రెట్ లీ

ఆ అలవాటును ఒక రోజులో మార్చలేం : బ్రెట్ లీ

బంతులను స్వింగ్ చేయడానికి లాలాజలాలను ఉపయోగించడం అలవాటుగా రాత్రిపూట మార్చలేమని బ్రెట్ లీ చెప్పారు. లాలాజల నిషేధం ప్రధానంగా బౌలర్లకు సమస్యగా మారుతుందని చాల మంది ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు భావిస్తుండగా, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మాత్రం ఫీల్డర్లు కూడా నష్టపోతారు అని తెలిపాడు. స్లిప్, కార్నర్ లో బంతులను సులభంగా పట్టుకోవడంలో సహాయపడటం వల్ల తన వేళ్లపై ఉమ్మివేయడం అలవాటు అని ఫాఫ్ డు ప్లెసిస్ అన్నాడు.

అయితే ఈ విషయం పై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ఇతరుల మాదిరిగానే నిషేధాన్ని అమలు చేయడం అంత సులభం కాదు అని తెలిపాడు. లెజండరీ ఫాస్ట్ బౌలర్ మాట్లాడుతూ.. ఆటగాళ్లు తమ కెరియర్లో 9, 10 సంవత్సరాల నుండి బౌలింగ్ చేసే ముందు తమ లాలాజలం ఉపయోగించడానికి ఆలవాటుపడ్డారు, అలాంటింది ఒక రాత్రి దానిని మార్చడం చాలా కష్టం అని బ్రెట్ లీ చెప్పారు.