బ్రహ్మోత్సవాల్లో బ్రేక్‌ దర్శనాలు రద్దు

బ్రహ్మోత్సవాల్లో బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల కొండపై కొలువైఉన్న శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రేక్‌, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ పేర్కొంది. భక్తులందరికీ స్వామి దర్శనం కల్పించేందుకే బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. సెప్టెంబర్ 12న అంకురార్పణతో మొదలై 21వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్టోబరు 9నుంచి 18వరకు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ రోజుల్లో భక్తులకు ఎలాంటి దర్శనాలకు అనుమతి ఇవ్వమని అధికారులు తెలిపారు.