వైరల్: పిల్లలను రక్షించుకునేందుకు ఉడత సాసహం... పాముతో ఫైట్... 

వైరల్: పిల్లలను రక్షించుకునేందుకు ఉడత సాసహం... పాముతో ఫైట్... 

కాకిపిల్ల కాకికి ముద్దు అనే సామెత గురించి అందరికి తెలుసు.  ఏ జంతువైనా తన పిల్లలపై తనకు ప్రేమ ఉంటుంది.  తన పిల్లలకు ఆపద వస్తే ప్రాణాలకు తెగించి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.  ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాటం చేస్తుంది.   తాను మరణించినా పిల్లలను కాపాడుకోవాలని చూస్తుంది.  

ఇలానే ఓ ఉడత ప్రయత్నంచేసింది. పిల్లలను తినేందుకు వచ్చిన ఓ పాముపై తల్లి ఉడత పోరాటం చేసింది. తన పిల్లలను జాగ్రత్తగా కలుగులో దాచిపెట్టి, పెద్ద నాగుపాముతో ఫైట్ చేసిన తీరు అద్భుతం అని చెప్పాలి.  ఉడత వీరోచిత పోరాటం ముందు పాము తలొగ్గక తప్పలేదు.  దీనికి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.