పబ్జీ గేమ్ ఆడొదన్నారని..బాలుడి సూసైడ్ !

పబ్జీ గేమ్ ఆడొదన్నారని..బాలుడి సూసైడ్ !

తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడకూడదని తల్లి మందలించిన పాపానికి ఒక మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో నివాసం ఉంటున్న ఒక 14 ఏళ్ల మైనర్ బాలుడు ప్రతిరోజు మొబైల్లో పబ్జీ ఆడుతూ ఉంటున్నాడు. అయితే ఈ రోజు కూడా పబ్జీ గేమ్ ఆడటానికి ఫోన్ తీసుకున్నప్పుడు ఇక ఫోన్ లో గేమ్ ఆడకూడదని తల్లి మందలించి ఫోన్ లాక్కుంది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సదరు 14 సంవత్సరాల బాలుడు తన గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డోర్ తీయమని తల్లి ఎంతగా తలుపు కొట్టినా కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచింది, వారు డోర్ ని బలవంతంగా ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు. వెళ్లి చూడగా మైనర్ బాలుడు ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించాడు. దీంతో తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.