గాలిమాష్టర్ గాలి పై మాట్లాడక ఏమి చెప్తాడు : బొత్స

గాలిమాష్టర్ గాలి పై మాట్లాడక ఏమి చెప్తాడు : బొత్స

ప్రజల ఆలోచనకు చంద్రబాబు భిన్నంగా ఉంటాడని ఏపీ మంత్రి బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు ను ప్రజలు ఎందుకు ఓడించారో ఆయనకి ఇప్పటికి తెలియటం లేదని, వ్యవసాయం దండగ అన్న  చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం మాట్లాడుతున్నాడని అన్నారు. రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వటం నాకేమి పని అన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు అవినీతి దోపిడీ కోసమే పోలవరం, అమరావతి అన్న ఆయన వాటిని ఏటీఎం కార్డులుగా వాడుకున్నాడని అన్నారు. పేదలకు పట్టాలిచ్చిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడైనా ఉందా ? అని ప్రశ్నించిన ఆయన చంద్రబాబుకు ఓడిపోయానన్న పశ్చాత్తాపం కనీసం కనిపించటం లేదని అన్నారు. అమరావతిలో వందల వేల ఎకరాలు బంధువులతో కొనిపించిన ఘనుడు చంద్రబాబు అని అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే ఎందుకు అంత ఆక్రోశం ? అని అయన ప్రశ్నించారు. రాష్ట్ర అప్పు పెరిగింది అభివృద్ధి కోసం తప్పా అవినీతి కోసం కాదని అయన అన్నారు. గాలిమాష్టర్ గాలి పై మాట్లాడక ఏమి చెప్తాడు ? అని అయన ప్రశ్నించారు.