40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఏమైంది..?
టీడీపీ పార్టీపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యులు కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీకి వచ్చారని మంత్రి బొత్స పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన శనివారం బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. సభా సంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీలో స్పీకర్‌ను, మండలిలో ఛైర్మన్‌ను చుట్టుముట్టారని తెలిపారు. రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు తాపత్రయ పడుతున్నాడని మండి పడ్డారు. సభా సంప్రదాయాల్ని చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. పోడియం దగ్గరకు వెళ్లినప్పుడు 40 ఏళ్ల అనుభవం ఏమైందని...? బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. స్పీకర్‌ను ఏకవచనంతో పిలుస్తూ అవమానించారని ఆగ్రహించారు. మాట్లాడేందుకు సమయం వస్తే వాళ్ల భజనకే ఉపయోగించుకున్నారని ఎద్దేవా చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)