బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు.. రియా బెయిల్‌పై ముగిసిన వాదనలు..

బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు.. రియా బెయిల్‌పై ముగిసిన వాదనలు..

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి.. బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు.. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయగా... ఆ పిటిషన్లపై ఇవాళ వాదనలు ముగిశాయి... అయితే, తీర్పును రిజర్వ్‌లో ఉంచింది హైకోర్టు. సెప్టెంబర్ 4న రియా సోదరుడు షోవిక్‌ను, సెప్టెంబర్ 8న రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.. ఇక, రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ అక్టోబర్ 6తో ముగియనుంది.. ప్రస్తుతం రియా చక్రవర్తి  బైకులా జైలులో ఉండగా, షోవిక్ తలోజాను సెంట్రల్ జైలులో ఉన్నాడు.. మరోవైపు.. రియా, షోవిక్‌కు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది ఎన్సీబీ.. ఈ ఇద్దరూ డ్రగ్స్ సిండికేట్‌లో సభ్యులని.. ప్రముఖలందరికీ డ్రగ్స్ సరఫరా చేసేవారితో సంబంధాలున్నాయని కోర్టుకు విన్నవించారు. ఇక, వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ చేయడంతో.. తీర్పు ఎలా ఉండబోతోందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.