హీరో సూర్యకు బెదిరింపు కాల్‌.. బాంబులతో పేల్చేస్తాం..!

హీరో సూర్యకు బెదిరింపు కాల్‌.. బాంబులతో పేల్చేస్తాం..!

ప్రముఖులకు బెదిరింపు కాల్స్ సర్వ సాధారణం అయిపోయాయి.. ముఖ్యంగా తమిళనాడులో సినీ హీరోలను టార్గెట్ చేసి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగుగుతున్నారు అజ్ఞాత వ్యక్తులు.. దీంతో.. పోలీసులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. ఆ మధ్య సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇంటికి బాంబ్‌ బెదిరింపు కలకలం సృష్టించగా.. ఆ తర్వాత హీరోలు అజిత్‌, విజయ్‌, దర్శకుడు మణిరత్నం ఇలా పలువురికి బెదిరింపుకాల్స్ వచ్చాయి.. ఇక ఇవాళ హీరో సూర్యకి బెదిరింపు కాల్‌ వచ్చింది. ఆఫీస్‌లో బాంబ్‌ పెట్టామంటూ కేటుకాళ్లు బెదిరింపు ఫోన్ కాల్ చేశారు. దీంతో హుటాహుటిన పోలీసులు చెన్నైలోని అల్వార్‌పేట సమీపంలో ఉన్న సూర్య ఆఫీసుకు చేరుకుని చెక్ చేశారు. ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఇది కూడా ఫేక్‌ కాల్‌గా తేల్చారు పోలీసులు. అయితే, వరుసగా సినీ పెద్దలను టార్గెట్‌ చేస్తూ ఇలా బెదిరింపు కాల్స్‌ రావడాన్ని మాత్రం పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.