జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు..

జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు..

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి కలకలం రేగింది. జమ్మూలోని బస్టాండ్‌ దగ్గర ఓ వాహనంలో బాంబు పేలింది. పేలుడుతో ఒక్కసారిగా ప్రయాణికులు భయంతో పరుగులుపెట్టారు. ఏం జరిగిందో తెలియక భయంతో వణికిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక పేలుడు ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా... వారిని ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలుడు తీవ్రతకు పార్కింగ్ లో ఉన్న పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. చైనాలో తయారైన గ్రెనేడ్ వల్ల పేలుడు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.