రీమేక్‌కు సిద్దమయిన ఊసరవెల్లి

రీమేక్‌కు సిద్దమయిన ఊసరవెల్లి

ఒక సినిమాను రీమేక్ చేయాలంటే ఆ సినిమా భారీగా కాసుల వర్షం కురిపించి ఉండాలి. లేదా మంచి ప్రజాదరణ పొందుండాలి. కానీ ఎటువంటి ప్రజాదరణ లేక, బాక్సీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ సినిమాను రీమేక్ ఎందుకు చేస్తారు. చేస్తారు, ఇదే తరహాలో తెలుగులో భారీ డిసాస్టర్‌గా మిగిలిన సినిమా ఊసరవెల్లిని ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. కానీ ఎంతటి తారలు ఉన్నా సినమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాను అప్పట్లో బెంగాలీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు. అయితే ఇప్పుడు టిప్స్ అనే సంస్థ ఈ సినిమాను హిందీలో తీసేందుకు ప్రయత్నిస్తోంది. హిందీ స్క్రిప్ట్‌లో భారీ మార్పులు ఉంటాయని తెలిసింది. ఇప్పటికి ఈ సినిమా స్క్రిప్ట్‌ను పూర్తిచేసుకుంటోంది. నటీనటులు, ఇతర టెక్నీషియన్లను త్వరలో నిర్ణయించనున్నారు. ఈ హిందీ వెర్షన్‌లో హీరో అక్షయ్ ప్రధాన పాత్ర చేస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్షయ్ వైవిధ్యమైన కాంసెప్టులను ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకని ఈ సినిమాలో అతడే హీరోగా చేసే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ సినిమా హిందీలోనైనా హిట్ అవుతుందేమో చూడాల్సిందే.