హైదరాబాద్ లో మరో పేలుడు కలకలం

హైదరాబాద్ లో మరో పేలుడు కలకలం

సికింద్రాబాద్ లో పేలుడు సంభవించింది. కెమికల్స్ డబ్బా ఒక పేలడంతో కలకలం రేగింది. రైల్వేస్టేషన్ కూతవేటు దూరం 31 బస్ స్టాప్ దగ్గర్లో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ ముందు పేలుడు జరగ్గా ఒకరి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ పరిశీలిస్తున్నాయి. చెత్త బండి నుండి చెత్త తీస్తుండగా కెమికల్స్ డబ్బా పేలినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాదు ప్రాంతానికి చెందిన 56 సంవత్సరాల రాజు 30 సంవత్సరాలుగా సికింద్రాబాద్లో ఉంటూ చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యధావిధిగా చెత్త ఏరుకునే సంచిలో డబ్బాలు తీసుకొచ్చి నేలకు వేసి కొట్టగా ఒక్కసారిగా కెమికల్ డబ్బాలు పేలినట్టు చెబుతున్నారు. దీంతో అతని ఎడమ చేతికి గాయాలు కాగా అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.