సోము వీర్రాజు ధీమా... 2024లో ఏపీలో బీజేపీదే అధికారం..!

సోము వీర్రాజు ధీమా... 2024లో ఏపీలో బీజేపీదే అధికారం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024 ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు ఏపీ బీజేపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు.. విజయవాడలో ఇవాళ ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న‌.. బీజేపీ-జనసేన పార్టీలు క‌లిసి ప‌నిచేస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్నవి కుటుంబ పార్టీలేన‌ని విమ‌ర్శించిన సోము వీర్రాజు.. ఏపీలో  బీజేపీ కీలక భూమి పోషించే సమయం వ‌చ్చేసింద‌న్నారు. బీజేపీ అవసరం కూడా రాష్ట్రానికి ఉంద‌ని బీజేపీ కొత్త చీఫ్‌.. మంచి పరిపాలన బీజేపీ లక్ష్యమ‌ని.. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జ‌ర‌గాల‌న్నారు. ఇక‌, 2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. అంతేకాదు.. బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఏపీకి ఎంతైనా ఉంద‌న్నారు.