ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు మళ్లీ అస్వస్థత.. విమానంలో ఆస్పత్రికి..!

ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు మళ్లీ అస్వస్థత.. విమానంలో ఆస్పత్రికి..!

భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడడంతో.. ఆమెను వెంటనే విమానంలో ముంబైకి తరలించారు.. ప్రస్తుతం ఆమె కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. సాధ్వీ ప్రగ్యా అని కూడా పిలువబడే ఈ ఎంపీ.. నెల రోజుల వ్యవధిలో ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి.. ఫిబ్రవరి 19వ తేదీన ఇలాంటి సమస్యలతో ఆమె న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు చికిత్స తీసుకున్నారు. ఇక, అంతకు ముందు, కరోనా వైరస్ లక్షణాలను కనిపించడంతో ఆమెను 2020 డిసెంబర్‌లో ఎయిమ్స్‌లో చేర్చారు. ఇలా ఈ మధ్య వరుసగా ఆస్పత్రులను చుట్టూ తిరుగుతున్నారు ప్రగ్యా సింగ్ ఠాకూర్. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.