మసీదును కూల్చడంలో కుట్ర లేదు.. ఓటు బ్యాంకు కుట్రే..!

మసీదును కూల్చడంలో కుట్ర లేదు.. ఓటు బ్యాంకు కుట్రే..!

బాబ్రీ మసీదును కూల్చడంలో కుట్ర ఏమీలేదన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన ఆయన.. ఆరోపణలను తిప్పికొడుతూ నిందితులుగా పేర్కొన్నవారిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు ఇవ్వడంతో కుట్రలేదని తేలిపోయిందన్నారు. బీజేపీ అగ్ర నేతలు ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషీలను కుట్ర పూరితంగా ఇరికించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని మండిపడ్డ జీవీఎల్.. కేవలం కాంగ్రెస్ ఆడిన ఓటు బ్యాంకు రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. మందిర నిర్మాణం, రాజకీయ కుట్రలను ఛేదిస్తూ వచ్చిన తీర్పుపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్న బీజేపీ ఎంపీ.. ఓటు బ్యాంకు రాజకీయాలను కాంగ్రెస్ ఇకనైనా మానుకోవాలి అని హితవుపలికారు. రాజకీయాలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించిన జీవీఎల్.. రాముడు హిందూ మతానికే కాదు, యావత్ భారత్ దేశానికి ఆరాధ్యదైవంగా చెప్పుకొచ్చారు.