జనగామలో బండి సంజయ్ పర్యటన... అప్రమత్తమైన పోలీసులు

జనగామలో బండి సంజయ్ పర్యటన...  అప్రమత్తమైన పోలీసులు

నేడు జనగామలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటిస్తున్నారు. నిన్న బీజేపీ నాయకులపై లాఠీచార్జీ చేసిన సీఐ పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో జనగామకు పిలుపు ఇచ్చారు.  పోలీసులు లాఠీ చార్జీ తో దెబ్బలు తిన్న బీజేపీ కార్యకర్తలు జనగామ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు .. వారిని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వస్తున్న నేపథ్యంలో ఏరియా హాస్పిటల్ దగ్గర భారీగా బీజేపీ శ్రేణులు చేరుకున్నారు.  దాంతో ఏరియా హాస్పిటల్ లో బారి బందోబస్తు ఏర్పటు చేశారు.