సీఎంతో బీజేపీ ఎమ్మెల్యే భేటీ అందుకేనా..?

సీఎంతో బీజేపీ ఎమ్మెల్యే భేటీ అందుకేనా..?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక పార్టీకి చెందిన వారు... మరో పార్టీ నేతను కలిస్తే తీవ్ర చర్చకు దారితీసింది. ఏపీ సీఎం చంద్రబాబును బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మంగళవారం కలిశారు. అమరావతిలో సీఎంను కలిసిన ఆయన తన నియోజకవర్గంలోని పలు పనులు, నిధుల వ్యవహారంపై చర్చించారని తెలుస్తుంది. అయితే, విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్న విష్ణుకుమార్ రాజు.. చంద్రబాబుతో ఈ విషయంపై చర్చించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ విషయంపై విష్ణుకుమార్ రాజుకు టీడీపీ అధినేత హామీ ఇచ్చారని... దానిపై చర్చించేందుకు చంద్రబాబును కలిశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.