మ‌ళ్లీ న‌న్ను సైడ్ చేస్తున్నారు..! రాజాసింగ్ ఆవేద‌న‌..

మ‌ళ్లీ న‌న్ను సైడ్ చేస్తున్నారు..! రాజాసింగ్ ఆవేద‌న‌..

రాజాసింగ్ పేరు తెలియ‌ని బీజేపీ కార్య‌క‌ర్త ఉండ‌రు.. కానీ, ప్ర‌తీ విష‌యంలో ఆయ‌న‌ను పార్టీ అధిష్టానం ప‌క్క‌న‌బెడుతూనే ఉంద‌నే విమ‌ర్శ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరిగి ఆయ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత ఆ విమ‌ర్శ‌లు త‌గ్గాయ‌ని చెబుతారు.. ప్ర‌తీ విష‌యంపై స్పందిస్తూ.. ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. అయితే, తాజాగా ప్ర‌క‌టించిన బీజేపీ రాష్ట్ర క‌మిటీ మ‌రోసారి చిచ్చుపెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. 

అస‌లు రాష్ట్ర క‌మిటీ ఏర్పాటులో నా అభిప్రాయం తీసుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కి వాట్సాప్ మెసేజ్ పంపిన ఆయ‌న‌.. రాష్ట్ర కమిటీ ఏర్పాటులో నా అభిప్రాయం తీసుకోలేద‌ని.. నా నియోజకవర్గ నుండి కమిటీలో ఎవ్వ‌రినీ తీసుకోలేదు... ఒక్కరు కూడా సమర్థులు లేరా? అంటూ ప్ర‌శ్నించారు. బీజేపీలో మరో సారి నన్ను సైడ్ చేస్తున్నార‌ని మెసేజ్‌లో పేర్కొన్న ఆయ‌న‌.. మీ నాయకత్వంలో బీజేపీలో మార్పు వస్తుందని అనుకున్నా.. కానీ, కనిపించడం లేదు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. పార్టీలో గ్రూపిజంని ఆపండి... కలిసి పని చేద్దాం అని విజ్ఞ‌ప్తి చేశారు రాజాసింగ్‌.